Kumbh Mela Coronavirus: హరిద్వార్‌లో ఐదు రోజుల్లో 2,167 కరోనా కేసులు.. ‘కుంభమేళా’ను కుదించలేం: అధికారులు
Haridwar Kumbh Mela 2021: ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పవిత్ర స్నానాలు
Haridwar Kumbh Mela 2021: ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పవిత్ర స్నానాలు చేసేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో కుంభమేళా రోజులను తగ్గించాలని పలువురి నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనిపై ఉత్తరాఖండ్ అధికారులు స్పందించారు. మహా కుంభమేళా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టంచేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చ జరుగలేదని పేర్కొన్నారు. రెండువారాల ముందుగానే కుంభమేళాను ముగిస్తారన్న వార్తలను కుంభమేళా అధికారి దీపక్ రావత్ ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళా తేదీలను కేంద్రం కుదించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని దీపత్ రావత్ పేర్కొన్నారు. ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. అవి సఫలం కాలేదన్నారు. కుంభమేళా తేదీల కుదింపు ప్రక్రియను ఎవరూ అంగీకరించరని తెలిపారు.
ఇదిలాఉంటే.. హరిద్వార్‌లో పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు చాలా మంది కరోనా బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రద్దీ లేని ఘాట్లలో పకడ్భందీగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ప్రధాన ఘాట్లలో రద్దీగా ఉన్న చోట్ల జరిమానాల విధింపు చాలా కష్టమని అధికారులు తెలిపారు. కుంభమేళాలో భాగంగా 27వ తేదీ రోజున పెద్ద ఎత్తున భక్తులు మూడో షాహీ స్నానాలు ఆచరించేందుకు వస్తారు.
ఐదు రోజుల్లో 2,167 కేసులు.. కరోనా పరీక్షల అనంతరం భక్తులను కుంభమేళాకు అనుమతిస్తున్నారు. అయితే నిత్యం వందలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదు రోజుల నుంచి మొత్తం 2,167 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. వీరిలో 500లకు పైగా మందికి ప్రధాన ఘాట్‌లల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఉత్తరఖండ్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రోజుకు 50 వేల కరోనా నిర్థారణ పరీక్షలను చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు పలు సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: