కర్ణాటకలో 60 వేలకు చేరువలో కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరోసారి లాక్‌డౌన్ విధిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. రోజు వేల సంఖ్యలో కరోనా..

కర్ణాటకలో 60 వేలకు చేరువలో కరోనా కేసులు
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 11:37 PM

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరోసారి లాక్‌డౌన్ విధిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 4,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,652కి చేరింది. వీటిలో 21,775 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 93 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,240కి చేరింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 36,631 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే 29 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!