చాణక్య నీతి : తల్లిదండ్రులు చేసే ఈ చిన్న తప్పే..తమ పిల్లలకు శత్రువులను చేస్తోంది!
Samatha
26 January 2026
ఆ చార్య చాణక్యుడు చాలా గొప్ప వ్యక్తి. ఈయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు
ఇక చాణక్యడు చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా జీవిత సమస్యలు, సమాజం, ప్రజలు, భవిష్యత్తు ఇలా చాలా విషయాల గురించి దాని ద్వారా తెలియజేయడం జరిగింది.
చాణక్య నీతి
నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాలను చాణక్యుడు తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో పొందుపరిచారు. అలాగే తల్లిదండ్రులు కూడా కొన్ని సమయంలో పిల్లలకు శత్రువులుగా మారుతారని ఆయన తెలిపారు.
చాణక్య సూత్రాలు
చాణక్య నీతి విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. తమ పిల్లలను విద్యకు దూరం చేసే తల్లిదండ్రులు వారికి అతి పెద్ద శత్రువులుగా కనిపిస్తారంట.
విద్యకు ప్రాముఖ్యత
చాణక్య నీతి ప్రకారం, పిల్లల విద్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదంట. వారికి విద్య మాత్రమే గౌరవం, జ్ఞానం తీసకొస్తుందంట.
విద్య నిర్లక్ష్యం
పిల్లలకు విద్య మంచి, చెడు మధ్య తేడాలను తెలిసేలా చేస్తుంది. అందుకే ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలి.
మంచి, చెడు తేడాలు
చదువుకున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు కీర్తిని తీసుకురావడమే కాకుండా, సమాజ పురోగతికి కూడా దోహద పడుతారు. అందుకే పిల్లలకు విద్యనందించడం తల్లిదండ్రుల కర్తవ్యం.
తల్లిదండ్రులకు కీర్తి
ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు విద్యను అందించరో, వారు తమ పిల్లలకు ఎప్పుడూ శత్రువులానే కనిపిస్తారని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.