కాణిపాకం ఆల‌యంలో భ‌క్తుల‌కు అనుమ‌తి..!

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క క్షేత్రంలో భ‌క్తుల ద‌ర్శ‌నాలు..ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు

కాణిపాకం ఆల‌యంలో భ‌క్తుల‌కు అనుమ‌తి..!
Follow us

|

Updated on: May 11, 2020 | 2:08 PM

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో దేశంలోని ఆల‌యాల‌న్ని మూసివేసిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌హా, షిర్డీ, శ్రీశైలం, ఉజ్జ‌యిని వ‌ర‌కు చిన్న పెద్ద ఆల‌యాల‌న్నీమూసివేశారు. భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి లేకుండా కేవ‌లం ఆల‌య నిర్వ‌హ‌కులు, ప్ర‌ధానార్చ‌కుల ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నిత్యం పూజాది కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే, కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ మే 17తో ముగుస్తుంది. ఈ క్ర‌మంలో ప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులను తిరిగి అనుమతించే అంశంపై అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క క్షేత్రం ప్ర‌పంచ ప్ర‌సిద్ది. క‌రోనా నేప‌థ్యంలో కాణిపాక క్షేత్రంలో కూడా భ‌క్తుల ద‌ర్శ‌నాలు నిలిపివేశారు. అయితే, మే 17తో మూడో ద‌శ లాక్‌డౌన్‌ ముగుస్తుంది కాబట్టి… ఆ తర్వాత ఆలయంలోకి తిరిగి భక్తుల్ని అనుమతిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై అధికారులు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, క్యూలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, అలాగే పూజలు, ప్రసాదాలు, అన్నదానం ఇతరత్రా అంశాలపై విధి విధానాల‌ను త‌యారు చేస్తున్నారు. ప్ర‌భుత్వం భ‌క్తుల‌కు అనుమ‌తించాక‌..రోజూ ప‌రిమిత సంఖ్య‌లో ద‌ర్శ‌నాలు క‌ల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సోషల్ డిస్టాన్స్ గుర్తుంచుకునేలా… ప్రత్యేక బాక్సులపై పెయింటింగ్ వేసి అక్కడక్కడా ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు అధికారులు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!