కరోనాకు మందు కనిపెట్టడం అసాధ్యం.!

ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి మందు కనిపెట్టడం అసాధ్యమని ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో అంటున్నారు. గతంలో ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వైరస్‌లకు కూడా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు 100కి పైగా వ్యాక్సిన్లు ప్రీ- క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్నాయని.. ఇక వాటిల్లో కొన్ని హ్యూమన్ ట్రయిల్ దశకు చేరుకున్నాయని తెలిపారు. ‘ఇప్పటికీ చాలా వైరస్‌లకు విరుగుడు లేవన్న […]

కరోనాకు మందు కనిపెట్టడం అసాధ్యం.!
Follow us

|

Updated on: May 11, 2020 | 2:04 PM

ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి మందు కనిపెట్టడం అసాధ్యమని ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో అంటున్నారు. గతంలో ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వైరస్‌లకు కూడా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు 100కి పైగా వ్యాక్సిన్లు ప్రీ- క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్నాయని.. ఇక వాటిల్లో కొన్ని హ్యూమన్ ట్రయిల్ దశకు చేరుకున్నాయని తెలిపారు. ‘ఇప్పటికీ చాలా వైరస్‌లకు విరుగుడు లేవన్న ఆయన.. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా అది సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం డేవిడ్ నబారో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ 19 సలహాదారుగా పని చేస్తున్నారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

మరోవైపు కోవిడ్ -19 వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుందని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే హెచ్ఐవి, మలేరియా వంటి వ్యాధుల మాదిరిగా కాకుండా, కరోనావైరస్ చాలా నెమ్మదిగా పరివర్తనం చెందుతుందని వారు భావిస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే విధానం నెమ్మదిగా, బాధాకరంగా ఉంటుందని నబారో ఎత్తి చూపారు. “ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల బట్టి మీకు ఆ మందుపై చాలా ఆశలు ఉన్నాయి. ఆపై అవి అడియాసలు కావచ్చు. మనం జీవన వ్యవస్థలతో డీల్ చేయాల్సి ఉందని.. యాంత్రిక వ్యవస్థలతో వ్యవహరించడం లేదని అన్నారు. శరీరం దానిపై ఏవిధంగా స్పందిస్తుందన్నదే ముఖ్యమైన అంశం”అని నబారో చెప్పారు.  (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!