AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: కరెంట్ బిల్ రూ.లక్ష దాటితే ఇక ఐటీ రిటర్న్ మస్ట్..

కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఆదాయపన్ను శాఖ. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్న్ దాఖలు చేయడాన్ని తప్పని సరి చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్‌కు...

షాకింగ్: కరెంట్ బిల్ రూ.లక్ష దాటితే ఇక ఐటీ రిటర్న్ మస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2020 | 8:07 PM

Share

కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఆదాయపన్ను శాఖ. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్న్ దాఖలు చేయడాన్ని తప్పని సరి చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్‌కు ఫారాలను నోటిఫై చేసింది. కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు ఐటీ ఫారాల్లో మార్పులు చేశారు. ఐటీ యాక్ట్ 1961లోని వేర్వేరు కాల పరిమితులను పొడిగించింది కేంద్రం.

ప్రత్యేక ఆర్డినెన్స్ 2020 ద్వారా ఈ మార్పులు చేసింది. దీని ప్రకారం చాప్టర్-వీఐఏ-బీ ద్వారా పెట్టుబడులు, ఇతర చెల్లిపులు, సెక్షన్ 80 సీ (ఎల్‌ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎన్‌సీ), 80 డీ (మెడిక్లెయిమ్), 80జీ (విరాళాలు) ప్రయోజనాలు పొందేందుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది.

ఐటీ రిటర్న్ ఫారాల్లోని కీలక మార్పులు ఇవే:

– కరెంట్ ఖాతాలో డిపాజిట్లు కోటి రూపాయలు దాటితే వివరాలు ఖచ్చితంగా తెలపాలి – కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే రిటర్న్ దాఖలు చేయాలి – విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 లక్షలు దాటితే వివరాలు తెలియజేయాలి – పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాలకు సంబందంచిన వివరాలను 2019-20, 2020 జూన్‌కు గానూ వేర్వేరుగా సమర్పించాలి

కాగా ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4ల ప్రయోజనం ఒక సంస్థలో లేదా, జాబితాలో లేని ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు పొందలేరని నంగియా అండర్సన్ కన్సల్టింగ్ డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఏ ఫారం ఎంచుకోవాలనే విషయంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి:

జూన్ 3న తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా