AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగో ఎయిర్‌లైన్స్: ఏడాది పాటు ఛార్జీల్లో రాయితీ..వారికి మాత్రమే..

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణ ఛార్జీల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్న సిబ్బంది..

ఇండిగో ఎయిర్‌లైన్స్: ఏడాది పాటు ఛార్జీల్లో రాయితీ..వారికి మాత్రమే..
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2020 | 5:28 PM

Share

కరోనా కల్లోల సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవ ఎనలేనిది. కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ.. ఐసోలేషన్ వార్డుల్లో ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారి ప్రాణాలు కాపాడుకోవటానికి, వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి యావత్ ప్రపంచం సలామ్ చేస్తోంది. వైద్యసిబ్బంది సేవలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తమవంతు కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంటోంది.

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫర్ ప్రకటించింది. డాక్టర్లకు, నర్సులకు ప్రయాణ ఛార్జీల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్నందున వీరికి ఈ ఏడాది చివరి వరకు విమాన ఛార్జీలపై రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. నర్సులు, వైద్యులు చెక్‌ ఇన్ సమయంలో వారి గుర్తింపును, ఆస్పత్రి ఐడీలను అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూడా డిస్కౌంట్ ఇవ్వబడుతుందని తెలిపింది. ఈ ఆఫర్ ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో రెండు నెలల విరామం తర్వాత మే 25న విమానాలు తిరిగి తమ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌