AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా దెబ్బకు 34 కోట్ల ఉద్యోగులకు గండం..!

కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇలాగే ఉంటే .. 2020 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పని గంటలలో 11.9 శాతం నష్టానికి సమానమ‌ని పేర్కొంది.

కరోనా దెబ్బకు 34 కోట్ల ఉద్యోగులకు గండం..!
Balaraju Goud
|

Updated on: Jul 02, 2020 | 5:01 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొవిడ్ రాకాసి ప్రభావంతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డుపడతున్నారు. దీని ప్రభావం ముందు ముందు మరింత తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇలాగే ఉంటే .. 2020 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పని గంటలలో 11.9 శాతం నష్టానికి సమానమ‌ని పేర్కొంది. ఐఎల్‌ఓ తాజా నివేదిక ప్రకారం 2020 రెండవ త్రైమాసికంలో ప్రపంచ పని గంటలు 14 శాతానికి తగ్గాయని.. ఇది 400 మిలియన్ల ఉద్యోగాల‌ను కోల్పోవడానికి స‌మానమని తెలిపింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని.. వారి పని గంటలు తక్కువగా ఉంటున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో 2020 ద్వితీయార్థంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మరింత సంక్షోభం తప్పదని నివేదికలో వెల్లడించింది. పేర్కొంది. కాగా, గ‌డ‌చిన కొద్ది వారాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల‌లోని ఆర్థిక వ్యవస్థల ఫ‌లితాలు భారీగా క్షిణించాయని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ పేర్కొన్నారు. దీని ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోందన్న రైడర్.. అంచనాలను మించిన విధ్వంసం కొనసాగుతందన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్య, పర్యాటక రంగాల్లోని చాలా సంస్థలు తమ ఉద్యోగుల్లో భారీగా కోతలు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతుంటే.. అమెరికా ఇందుకు భిన్నమైన గణాంకాలను విడుదల చేసింది. జూన్‌ నెలలో 24 లక్షల మందికి అమెరికా సంస్థలు ఉద్యోగావకాశాలను కల్పించినట్లు ఓ ప్రైవేటు సర్వే తెలిపింది. ఇక ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.