రాజధానిలో తొలి ‘ప్లాస్మా బ్యాంక్’ ప్రారంభం..

భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగుల‌కు ప్లాస్మా థెర‌పీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఈ థెర‌పీ ప‌నికొస్తుందని తేలటంతో..

రాజధానిలో తొలి ‘ప్లాస్మా బ్యాంక్’ ప్రారంభం..
Follow us

|

Updated on: Jul 02, 2020 | 4:53 PM

భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటి సారిగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్. గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగుల‌కు ప్లాస్మా థెర‌పీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఈ థెర‌పీ ప‌నికొస్తుందని తేలటంతో ఢిల్లీలో బ్లడ్ బ్యాంక్ తరహాలో ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లుగా సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్బంగా సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చే దాతలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలను ఈ సందర్బంగా సీఎం వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు…’కోవిడ్-19 నుంచి కోలుకుని, 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 50 కిలోలకు పైగా బరువు ఉన్న వ్యక్తులు కోవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. మధుమేహం, రక్తపోటు, కేన్సర్స్‌తో బయటపడిన వారు, లివర్, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉన్న వారు ప్లాస్మా డొనేట్ చేయరాదని చెప్పారు.

ఇక, ఢిల్లీలోని  స్థానికులు ఎవరైన ప్లాస్మాను దానం చేయ‌ద‌ల‌చుకున్నవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చే వారు  1031 నంబ‌ర్‌కు గానీ, లేదా 8800007722 నంబ‌ర్‌కు వాట్సాప్ చేయ‌వ‌చ్చునని చెప్పారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్లాస్మా బ్యాంక్ న‌డుస్తుంది. దాతలు సిద్ధంగా ఉంటే వారు ప్లాస్మాను దానం చేసేందుకు అర్హులో, కాదో వైద్య సిబ్బంది నిర్ణ‌యించి.. దాని ప్ర‌కారం ప్లాస్మాను తీసుకుంటారు. ప్లాస్మాను దానం చేసే వారి కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం ఉచితంగా ర‌వాణా స‌దుపాయం కూడా అందిస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..