ఐపీఎల్‌ను నిర్వహించేందుకు అరబ్‌ ఎమిరేట్స్‌, శ్రీలంక రెడీ

ప్రపంచకప్‌ వాయిదా పడితే మాత్రం అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో ఐపీఎల్‌ను కండక్ట్‌ చేయడానికి సమాయత్తమవుతోంది బీసీసీఐ..

ఐపీఎల్‌ను నిర్వహించేందుకు అరబ్‌ ఎమిరేట్స్‌, శ్రీలంక రెడీ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 4:26 PM

ఆస్ట్రేలియాలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా పాజిటివ్‌ కేసుల కారణంగా టీ-20 వరల్డ్‌కప్‌కు వాయిదా వేయడం మినహా మరో దారి లేదు.. ఒకవేళ వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తే ఎంచక్కా ఐపీఎల్‌ను నిర్వహించుకోవచ్చని బీసీసీఐ అనుకుంటోంది.. టీ-20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తున్నామని కానీ, షెడ్యూల్‌ ప్రకారమే జరుపుతామని కానీ ఇప్పటి వరకు ఐసీసీ చెప్పలేదు.. షెడ్యూల్‌ ప్రకారమైతే అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో వరల్డ్‌కప్‌ జరగాలి.. అయితే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్వమిచ్చే మెల్‌బోర్న్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది.. ఇలాంటి పరిస్థితులలో మ్యాచ్‌లను నిర్వహించడం కష్టమే!

అయితే బీసీసీఐ మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది..ప్రపంచకప్‌ వాయిదా పడితే మాత్రం అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో ఐపీఎల్‌ను కండక్ట్‌ చేయడానికి సమాయత్తమవుతోంది బీసీసీఐ.. అయితే భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది.. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ను మరో చోట నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది.. ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ సిద్ధంగా ఉంది.. అలాగే మాకో ఛాన్స్‌ ఇచ్చి చూడండంటోంది శ్రీలంక. ఐపీఎల్‌ నిర్వహణపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు కానీ.. ఒకవేళ కండక్ట్‌ చేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా విదేశాల్లోనేనని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు.

ప్రేక్షకులు ఎవరూ లేని ఖాళీ గ్రౌండ్‌లలోనే పోటీలను నిర్వహిస్తామన్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ను ఇక్కడే నిర్వహించాలన్న రూలేమీ లేదు.. 2009లో జరిగిన రెండో ఎడిషన్‌ను దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది. ఎలాగూ ఖాళీ మైదానాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలనుకుంటున్నామని.. అలాంటప్పుడు ఎక్కడ నిర్వహిస్తే ఏమిటని ప్రశ్నిస్తున్నారు బీసీసీఐ అధికార ప్రతినిధి!