కోటికి చేరువలో కరోనా టెస్టులు.. ఇప్పటి వరకు చేసినవి ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ మహమ్మారిని గుర్తించేందుకు చేపట్టే పరీక్షలు..

కోటికి చేరువలో కరోనా టెస్టులు.. ఇప్పటి వరకు చేసినవి ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 6:32 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ మహమ్మారిని గుర్తించేందుకు చేపట్టే పరీక్షలు మన దేశంలో కోటికి చేరువయ్యాయి. మన దేశంలో తొలుత కరోనా టెస్టులు చేసే సామర్థ్యం తక్కువగా ఉండటంతో.. పరీక్షలు నిర్వహించడం కాస్త ఆలస్యమైంది. లాక్‌డౌన్‌ విధించి దాదాపు 100 రోజులు దాటింది. అయితే ఇప్పటి వరకు దేశంలో జరిపిన కరోనా పరీక్షల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ వివరించారు. ఇప్పటి వరకు దేశంలో 91 లక్షల టెస్టులు జరిపామని.. త్వరలోనే వీటి సంఖ్య కోటికి చేరుకుంటుందన్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారితో దేశం యుద్ధం చేస్తుందని.. ఖచ్చితంగా ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 135 కోట్ల భారతీయుల్లో 6 లక్షల మందికి కరోనా సోకిందని.. అందులో ఇప్పటికే మూడు లక్షల అరవై వేల మందికిపైగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.ఇక దేశంలో కరోనా మరణాల శాతం 2.94 కంటే తక్కువగా ఉందని.. రికవరీ రేటు గణనీయంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున జరుపుతున్నామని.. రోజుకు రెండు నుంచి మూడు లక్షల వరకు చేపడుతున్నట్లు వివరించారు. తొలుత ఒకే ఒక్క పరీక్ష కేంద్రం నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా లేబోరేటరీలు ఉన్నాయని తెలిపారు.