కష్టాల్లో ఉన్న ఇటలీకి భారత్ చేయూత..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత ఇబ్బందులు పెడుతుందో తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో పదిహేను వేలమంది వరకు చనిపోయారు. మరో మూడున్నర లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇటలీలో ఎక్కువ విజృంభిస్తోంది. చైనాలో కంటే ఇటలీలో అత్యధికంగా ప్రాణాలుకోల్పోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు వర్ణణాతీతం. కనీసం శవాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా వీలులేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఇటలీకి చేయుతనిచ్చేందుకు ఇతర దేశాలు […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత ఇబ్బందులు పెడుతుందో తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో పదిహేను వేలమంది వరకు చనిపోయారు. మరో మూడున్నర లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇటలీలో ఎక్కువ విజృంభిస్తోంది. చైనాలో కంటే ఇటలీలో అత్యధికంగా ప్రాణాలుకోల్పోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు వర్ణణాతీతం. కనీసం శవాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా వీలులేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఇటలీకి చేయుతనిచ్చేందుకు ఇతర దేశాలు కొన్ని ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న ఇటలీకి.. మన భారత ప్రభుత్వం కూడా సహాయం చేస్తోంది. ఇప్పటికే అక్కడికి మాస్క్‌లు, వైద్యపరికరాలను పంపించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్నసమయంలో భారత్ మాస్క్‌లు, వైద్యపరికరాలు పంపించడాన్ని ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతించింది. కష్టకాలంలో ఉన్న తమకు భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కాగా.. గతంలో చైనాకు కూడా.. భారత్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లౌస్‌తో పాటు పలు వైద్యపరికరాలను పంపించింది.