AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు మాత్రమే కాదు.. ఈ లక్షణం ఉన్నా కూడా కరోనా సోకినట్టేనట..?

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. మరోపక్క కరోనా లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్‌కు

జలుబు మాత్రమే కాదు.. ఈ లక్షణం ఉన్నా కూడా కరోనా సోకినట్టేనట..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 23, 2020 | 9:37 PM

Share

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. మరోపక్క కరోనా లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ లక్షణాలున్నా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇలా ఉండగా.. జలుబు, దగ్గు కాకుండా వేరే లక్షణాలతో కూడా కరోనా బారిన పడుతున్నట్టు తన పరిశోధనలో తెలిసిందని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. వాసన చూసే స్వభావాన్ని కోల్పోవడం. ముఖ్యంగా యువత.. ఉన్నట్టుండి వాసన చూసే స్వభావాన్ని కోల్పోయినట్టయితే.. అది కరోనా పాజిటివ్ లక్షణం కావచ్చని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, బ్రిటిష్ డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, దగ్గు లేకపోయినప్పటికి.. ఈ లక్షణం ఉన్నట్టయితే కరోనా సోకినట్టు భావించవచ్చని అన్నారు. కరోనా బారిన పడిన బాధితుల్లో కొంతమంది రుచిని చూసే స్వభావం కోల్పోవడం కూడా గమనించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాసన చూసే స్వభావాన్ని కూడా కరోనా లక్షణాల జాబితాలోకి చేర్చాలని యూకేలోని ఈఎన్‌టీ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Follow Us
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు