India Covid-19: దేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య.. తగ్గుతున్న కేసుల ఉధృతి..

India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో

India Covid-19: దేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య.. తగ్గుతున్న కేసుల ఉధృతి..
Coronavirus Updates
Follow us

|

Updated on: Jul 02, 2021 | 10:07 AM

India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో (గురువారం) కొత్తగా 46,617 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 853 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251 కు పెరగగా.. మరణాల సంఖ్య 4,00,312 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. గురువారం క‌రోనా నుంచి 59,384 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,95,48,302 కి పెరగింది. ప్రస్తుతం దేశంలో 5,09,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 34,00,76,232 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిన్న దేశవ్యాప్తంగా 18,80,026 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి దేశంలో 41,42,51,520 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.

Also Read:

Water Project Security: రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం.. పోలీసు పహారాలోకి ప్రాజెక్టులు..

UAE Ban Travel :14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ..! భారత్, పాకిస్తాన్‌ తో సహా ఈ దేశాలకు వెళ్లలేరు..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!