Covid 19 Cases: దేశంలో కనిష్ట స్థాయికి కోవిడ్ యాక్టివ్ కేసులు.. ఇవాళ కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
India Coronavirus Cases today: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు మొత్తం 1,16,50,55,210 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కొత్త కేసుల కలుపుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,45,10,413 కు పెరిగింది.
అదే సమయంలో, ఇప్పటివరకు మొత్తం 3,39,22,037 మంది రోగులు కోలుకున్నారు. మరణాల సంఖ్య కూడా 4,65,662కి పెరిగింది. దీంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది గత 532 రోజుల్లో కనిష్ట స్థాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువ. ప్రస్తుతం, ఇది 0.36 శాతంగా నమోదైంది. ఇది మార్చి 2020 తర్వాత నమోదైన అతి తక్కువ కావడం విశేషం.
అదే సమయంలో, గత 48 రోజులుగా రోజువారీ సానుకూలత రేటు స్థిరంగా 2 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది 0.98 శాతంగా నమోదైంది. అయితే ఈ వారం పాజిటివిటీ రేటు వరుసగా 58 రోజులు 2 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ సమయంలో 0.94 శాతం నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,16,50,55,210 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు.
#COVID-19 | India reports 10,488 new cases, 12,329 recoveries & 313 deaths in the last 24 hours, as per Union Health Ministry.
Total cases 3,45,10,413 Total recoveries 3,39,22,037 Death toll 4,65,662 Active cases 1,22,714
Total Vaccination: 1,16,50,55,210 pic.twitter.com/CImIcmfqTf
— ANI (@ANI) November 21, 2021
ఇదిలావుంటే, గతేడాది ఆగస్టు 7న దేశంలో సోకిన వారి సంఖ్య 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు పైగా నమోదైంది. అదే సమయంలో, మొత్తం కరోనా కేసులు సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు దాటాయి. దేశంలో డిసెంబర్ 19న ఈ కేసులు కోటి దాటగా, ఈ ఏడాది మే 4న రెండు కోట్లకు చేరుకుంది. ఆ సంఖ్య జూన్ 23న మూడు కోట్లు దాటింది.
మరోవైపు, కేంద్రం మరియు డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్‌మెంట్ కేటగిరీ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 129 కోట్లకు పైగా యాంటీ కోవిడ్ 19 వ్యాక్సిన్‌లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రస్తుతం 21.65 కోట్లకు పైగా యాంటీ కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, వాటిని ఇంకా ఉపయోగించలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.