Covid 19 Fourth Wave: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో ఎంత మంది మృతి చెందారంటే..
గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభించాయి. నిన్న ఒక్క రోజులోనే (శనివారం) దాదాపు 18,257ల కరోనా కేసులు కొత్తగా నమోదయినట్లు ఆదివారం (జులై 10) కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి..
Coronavirus LIVE Updates: గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభించాయి. నిన్న ఒక్క రోజులోనే (శనివారం) దాదాపు 18,257ల కరోనా కేసులు కొత్తగా నమోదయినట్లు ఆదివారం (జులై 10) కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. శుక్రవారం 18,840 పాజివిట్ కేసులు నమోదుకాగా శనివారం నాటికి స్వల్పంగా కేసులు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇక గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 42 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,25,428కి చేరుకుంది. గత 24 గంటల్లో 3,662 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కాసేలోడ్ 1,28,690కి చేరుకుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 0.30 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.50గా ఉన్నట్లు నమోదయ్యింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెల్పింది.
ఇక దేశ రాజధానిలో 544 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా శనివారం 2,760 కొత్త కరోనావైరస్ కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతి చెందారు. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,81,875 మంది వైరస్ బారినపడ్డారు. 844 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఆదివారం ప్రచురించిన డేటా ప్రకారం.. చైనాతో జూలై 9న 420 కొత్త కేసులు నమోదయ్యాయి. ములై 8న 455 కేసులు నమోదయ్యాయి. 319 కేసులు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నట్లు చైనా వెల్లడించింది. ఇటలీలో కొత్తగా 98,044 మందికి వైరస్ సోకగా.. 105 మంది మరణించారు. జపాన్లో కొత్తగా 49,557 మందికి వైరస్ సోకింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో 40,905 కేసులు నమోదు కాగా.. 154 మంది మృతి చెందారు. ఆస్ట్రేలియాలో 37,344 మంది కొవిడ్ బారినపడగా, 77 మంది ప్రాణాలు కోల్పోయారు.