‘కరోనా అదుపులో మన దేశమే భేష్’.. కేంద్ర మంత్రి హర్ష వర్ధన్
కరోనా రాకాసిని అదుపు చేయడంలో ఇతర దేశాలకన్నా మన దేశమే చాలా బెటరని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. బహుశా ప్రపంచంలో మరే దేశం కూడా ఇంతగా కృషి చేయలేదన్నారు. ఇండియా బెస్ట్ అనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి అంశాన్నీ ఉన్నత స్థాయిలో సమీక్షించామని, ప్రధాని మోదీ నిపుణులందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. దేశంలో కొత్తగా కరోనా కేసులు 1118 కి చేరుకోవడం, 11, […]

కరోనా రాకాసిని అదుపు చేయడంలో ఇతర దేశాలకన్నా మన దేశమే చాలా బెటరని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. బహుశా ప్రపంచంలో మరే దేశం కూడా ఇంతగా కృషి చేయలేదన్నారు. ఇండియా బెస్ట్ అనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి అంశాన్నీ ఉన్నత స్థాయిలో సమీక్షించామని, ప్రధాని మోదీ నిపుణులందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. దేశంలో కొత్తగా కరోనా కేసులు 1118 కి చేరుకోవడం, 11, 933 ఇన్ఫెక్షన్లు నమోదు కావడం, 392 మంది రోగులు మృతి చెందిన నేపథ్యంలో ఈ మంత్రిగారి వ్యాఖ్యలను పలువురు నిపుణులు పలురకాలుగా అన్వయించుకుంటున్నారు.
కరోనా లొకేషన్, క్లస్టర్స్, హాట్ స్పాట్స్ తెలుసుకున్నామని, సుమారు 400 జిల్లాల్లో ఈ వైరస్ లేదని హర్షవర్ధన్ చెప్పారు. 150 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించామన్నారు. 1994 లో ప్లేగు వ్యాధిని అదుపు చేశామని, 2014 లో ఎబోలా వైరస్ ఈ దేశంలోకి ప్రవేశించకుండా చూశామని, అలాగే స్మాల్ పాక్స్ , పోలియోలను పూర్తిగా నిర్మూలించగలిగామని ఆయన పేర్కొన్నారు.