కరోనాను కట్టడి చేయగల ఇండియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
స్మాల్ పాక్స్, పోలియో వంటి రెండు పెద్ద మహమ్మారిలను నిర్మూలించగలిగిన ఇండియా-ప్రస్తుతం కరోనాను కూడా కట్టడి చేయగలదన్న విశ్వాసాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె.ర్యాన్ వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అయితే ఇండియా ఈ అంటువ్యాధిని అంతం చేయగలదు. ఆ సామర్థ్యం ఆ దేశానికి ఉంది.. అన్నారాయన. కానీ ఇండియాలో మరిన్ని అత్యాధునిక ల్యాబ్ లు ఏర్పాటు కావలసి ఉందని, జనాభా ఎక్కువగా ఉన్న ఆ దేశం.. పోలియో, స్మాల్ […]
స్మాల్ పాక్స్, పోలియో వంటి రెండు పెద్ద మహమ్మారిలను నిర్మూలించగలిగిన ఇండియా-ప్రస్తుతం కరోనాను కూడా కట్టడి చేయగలదన్న విశ్వాసాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె.ర్యాన్ వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అయితే ఇండియా ఈ అంటువ్యాధిని అంతం చేయగలదు. ఆ సామర్థ్యం ఆ దేశానికి ఉంది.. అన్నారాయన. కానీ ఇండియాలో మరిన్ని అత్యాధునిక ల్యాబ్ లు ఏర్పాటు కావలసి ఉందని, జనాభా ఎక్కువగా ఉన్న ఆ దేశం.. పోలియో, స్మాల్ పాక్స్ వ్యాధులను అంతం చేసి తానేమిటో ప్రపంచ దేశాలకు తన సత్తా చూపిందని ర్యాన్ అన్నారు. భారత్ వంటి దేశాలు ఈ విధమైన రోగాలను అదుపు చేయడానికి తాము ఏ చర్యలు చేపట్టామో ఇతర దేశాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ర్యాన్ అభిప్రాయపడ్డారు. తాజాగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా పెరగగా.. మృతుల సంఖ్య 14 వేలకు పెరిగింది.