లాక్ డౌన్.. హైదరాబాద్ లో రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్
కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని పట్టించుకోకుండా.. నిబంధనలు గాలికి వదిలేసి.. అనేకమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని పట్టించుకోకుండా.. నిబంధనలు గాలికి వదిలేసి.. అనేకమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. వాహన దారులు దూసుకుపోతున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడంలేదు. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో తానే సాధారణ ట్రాఫిక్ పోలీసు ఇన్స్ పెక్టర్ గా కొంతసేపు వ్యవహరించారు. కారణం లేకుండా వాహనాల్లో వస్తున్నవారిని ఆపి.. లాక్ డౌన్ నిబంధనలను వారికి వివరించారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారిని, గుర్తింపు కార్డులను చూపినవారిని అనుమతించారు. చాలామందిని తిప్పి పంపేశారు. సిటీలో అనేక చోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ రూల్స్ ని ఖఛ్చితంగా అమలు చేస్తున్నారు.