కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

India 21 Days Lockdown: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహాయించి.. ప్రజా రవాణా అంతా బంద్ అయింది. అటు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. పలువురు డాక్టర్లు అయితే ఇళ్లకు వెళ్తే ఎక్కడ తమవారికి వైరస్ సోకుతుందోనన్న భయంతో వెళ్ళడం కూడా మానేశారు. ఇదిలా ఉంటే కరోనా నివారణలో […]

Ravi Kiran

|

Apr 10, 2020 | 2:40 PM

India 21 Days Lockdown: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహాయించి.. ప్రజా రవాణా అంతా బంద్ అయింది. అటు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. పలువురు డాక్టర్లు అయితే ఇళ్లకు వెళ్తే ఎక్కడ తమవారికి వైరస్ సోకుతుందోనన్న భయంతో వెళ్ళడం కూడా మానేశారు. ఇదిలా ఉంటే కరోనా నివారణలో భాగంగా వైద్య సేవలను విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

లింగ నిర్ధారణ పరీక్షలపై ఉన్న నిబంధనలను జూన్ 30 వరకు సడలిస్తూ మోదీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గృహ హింస కేసులు ఎక్కువైయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక వాస్తవానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే క్లినిక్‌లన్నీ కూడా తమ వద్ద టెస్టులకు వచ్చిన గర్భవతుల జాబితాను నమోదు చేసి స్థానికంగా ఉన్న ఆరోగ్య అధికారులకు సమర్పించాల్సి ఉంది. అయితే కరోనా రోగులతో ఆసుపత్రులు ఫుల్ అయిపోవడం.. అటు ఆరోగ్యశాఖ అధికారులు కరోనా కట్టడికి నివారణ చర్యలు చేపడుతుండటంతో జూన్ 30 వరకు ఆ క్లినిక్‌లు ఎటువంటి రిపోర్టులను నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నేపధ్యంలో నిబంధనలను సడలిస్తే అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అటు 2015లో 15.6 మిలియన్ అబార్షన్లు జరిగాయని ల్యాన్సెట్ నివేదికనిచ్చిందని.. కేంద్రం సడలించిన నిబంధనలు కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీపీఎం-ఎల్ సభ్యురాలు – అఖిల భారత అభ్యుదయ మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు కవితా కృష్ణన్ అంటున్నారు.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu