Covid Vaccine: కదులుతోన్న యువ భారతం.. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్.. మూడు రోజుల్లో ఏకంగా..
Covid Vaccine: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా అంతానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్ మాత్రమేననేది చాలా మంది నిపుణుల అభిప్రాయం. దీంతో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి...
Covid Vaccine: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా అంతానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్ మాత్రమేననేది చాలా మంది నిపుణుల అభిప్రాయం. దీంతో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా తాజాగా భారత సర్కారు 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా తెలుస్తోన్న గణంకాల ఆధారంగా టీనేజర్లు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 1,24,02,515 టీకా డోసులు తీసుకున్నట్లు తేలింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ గణంకాలను వెల్లడించింది.
టీనేజర్లు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తీసుకోవడంపై కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా యువతను అభినందించారు. బుధవారం ఒక్కరోజే 37,44,635 డోసులు టీనేజర్లు తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది ఆరోగ్యశాఖ. ఇదిలా ఉంటే అర్హులైన వారు వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని మంత్రి యువతకు సూచించారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 148.58 కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఓవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంటే మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా పాజిటివి రేటు కూడా రోజురోజుకీ పెరిగిపోతుండడంతో దేశం థార్డ్ వేవ్‌లోకి ప్రవేశించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: India Corona Cases: జెట్ స్పీడ్‌తో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో 55 శాతంకు పైగా కేసులు..
Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)