Coronavirus Effect: డాక్టర్.. డాక్టర్.. అని ఎంత పిలిచినా ఒక్కరూ పట్టించకోలేదు.. కన్నీరు పెట్టిస్తున్న మహిళ ఆర్తనాదాలు..!
Coronavirus Effect: శవాలతో నిండిపోతున్న ఆస్పత్రులు.. మార్చురీలో కెపాసిటీకి మించి డెడ్ బాడీలు.. భారీగా పెరుగుతున్న మరణాలు...
Coronavirus Effect: శవాలతో నిండిపోతున్న ఆస్పత్రులు.. మార్చురీలో కెపాసిటీకి మించి డెడ్ బాడీలు.. భారీగా పెరుగుతున్న మరణాలు… శవాల దిబ్బగా హాస్పిటల్స్.. స్మశానంలో హౌస్‌ఫుల్ బోర్డులు. ఈ దయనీయ స్థతిని వర్ణించడానికి ఎంత ఘోరంగా ఉంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కాటుకు దేశ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి పార్కింగ్ స్థలంలో ఎదరు చూసి.. చూసి.. చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ.. తన తండ్రికి కరోనా సోకడంతో తొలుత స్థానిక ఆస్పత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం రాష్ట్ర రాజధాని రాంచీలోని సదన్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే, అదే సమయంలో సదన్ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డును రాష్ట్ర ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా తనిఖీ చేశారు. దాంతో వైద్యులెవరూ ఆ కరోనా పేషెంట్‌ను పట్టించుకోలేదు. దాదాపు అరగంటపాటు.. పార్కింగ్ స్థలంలోనే వేచి ఉన్నారు. బాధిత వ్యక్తికి పరిస్థితి విషమిస్తుండటంతో అతని కూతురు ‘డాక్టర్.. డాక్టర్.. కాపాడండి’ ఆర్తనాదాలు చేసింది. ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి బాధిత వ్యక్తి పార్కింగ్ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పేషెంట్ చనిపోయిన తరువాత వైద్యులు వచ్చి పరిశీలించారు. అతను చనిపోయాడని నిర్ధారించారు. దీంతో బాధిత వ్యక్తి కూతురు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వైద్యుల నిర్వాకం, మంత్రి రాకపై భగ్గుమంది.
‘‘మంత్రి గారూ ఎందుకు వచ్చారు? డాక్టర్.. డాక్టర్.. అని అరిచినా ఒక్కరూ పట్టించుకోలేదు. మీరాక కారణంగా అర్థగంటల నుంచి ఎవరూ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. డాక్టర్ కోసం కేకలు వేశా. మా నాన్నను కాపాడమని ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా.. ఏ ఒక్కరూ స్పందించలేదు. మీరు ఓట్ల కోసమే వస్తారు. ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదు’’ అంటూ బోరున విలపిస్తూనే తనలో ఆగ్రహాన్ని మంత్రిపై ప్రదర్శించింది. కాగా, బాధిత మహిళ ఆర్తనాదాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం కన్నీరుకారుస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి, వైద్యుల నిర్వాకంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Video:
Also read: