UP CM Yogi Adityanath : యూపీలో కరోనా కరాళ నృత్యం.. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేష్‌లకు కరోనా
UP CM Yogi Adityanath test Covid-positive : యూపీలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ..
UP CM Yogi Adityanath test Covid-positive : యూపీలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న సీఎం యోగి సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డంతో సీఎం యోగి నిన్నటి నుంచి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కాగా, ఇవాళ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్వయంగా వెల్లడించారు. అటు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవాళే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఫలితంగా సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నానని చెప్పారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నానని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు, వాళ్లంతా కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆయన అభ్యర్థించారు. కాగా, ఇటీవలే హరిద్వార్ లోని మహాకుంభమేళాలో అఖిలేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
కుంభమేళా ప్రాంతంలోని కరోనా క్యాంపుల్లో చేసిన టెస్టుల్లో గత రెండు రోజుల్లో వెయ్యిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విశేషం. ఇలాఉండగా, దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కేసుల సంఖ్య కొత్త రికార్టులకు చేరుతోంది. ఉత్తర ప్రదేశ్ తోపాటు, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా అనేక చోట్ల రాత్రి నుంచి కరోనా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అటు, పలు రాష్ట్రాల్లో అనేకమంది రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారికి చిక్కుతున్నారు. తాజా సమాచారం ప్రకారం యూపీ మినిస్టర్ అశుతోష్ టాండన్ కూడా కరోనా బారిన పడ్డారు.
शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2021
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 14, 2021
Read also : Nara Lokesh : ‘లోకేష్ ఇక్కడ.., జగన్ ఎక్కడ..?’, ఇక్కడికి రండి… ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ ఛాలెంజ్