Air India: అప్పటికల్లా పూర్తి కానున్న ఎయిర్ ఇండియా అమ్మకం.. వడివడిగా అడుగులు.. బిడ్ల ప్రక్రియ ప్రారంభం..!
Privatisation of Air India: ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణలపై కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని పూర్తిగా ప్రైవేటీకరించడం.. లేదా మూసివేయడం
Privatisation of Air India: ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణలపై కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని పూర్తిగా ప్రైవేటీకరించడం.. లేదా మూసివేయడం తప్ప వేరే మార్గమే లేదంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటించిన నాటి నుంచి ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతోంది. ఎయిర్ ఇండియా అమ్మకం వచ్చే సెప్టెంబర్ నాటికి ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అయితే.. గతేడాది డిసెంబర్‌లో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి ప్రాథమిక బిడ్లు వేసిన బహుళ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉంది. అయితే ప్రాథమిక బిడ్లను విశ్లేషించిన తరువాత అర్హత కలిగిన బిడ్డర్లకు ఎయిర్ ఇండియా వర్చువల్ డాటా రూమ్ (వీడీఆర్) కు ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీని తరువాత పెట్టుబడిదారుల ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈ లావాదేవీలు ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ల దశకు చేరుకుందని, ఈ ఒప్పందం సెప్టెంబర్ నాటికి ముగుస్తుందని పేర్కొంటున్నారు. 2007 లో దేశీయ ఆపరేటర్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అయినప్పటి నుంచి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాలో మొత్తం 100 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ వాటా అమ్మకం ప్రక్రియ మరింత ఆలస్యమైంది.
ఇదిలాఉంటే.. 1932 లో మెయిల్ క్యారియర్‌గా ప్రారంభమైన ఎయిర్ ఇండియా అనతి కాలంలోనే పేరును గడించింది. ఆస్తుల పరంగా ఎయిర్ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ.. ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని హర్దీప్ సింగ్ పురి ఇటీవల తెలిపారు. అయితే ఈ రుణ భారాన్ని తగ్గించడం కోసం కొత్త యాజమాన్యం రాక తప్పదని హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పట్టనుంది.
Also Read: