కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకాను అభివృద్ధి చేయడం కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లు చేతులు కలిపాయి. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ-పుణె) సేకరించిన వైరస్‌ రకాన్ని (వైరస్‌ స్టెయిన్‌) ఉపయోగించుకొని పూర్తి స్వదేశీ టీకాను సాకారం చేసేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. Read This: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్! ఇందుకోసం ఈ […]

Ravi Kiran

|

May 10, 2020 | 1:56 PM

కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకాను అభివృద్ధి చేయడం కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లు చేతులు కలిపాయి. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ-పుణె) సేకరించిన వైరస్‌ రకాన్ని (వైరస్‌ స్టెయిన్‌) ఉపయోగించుకొని పూర్తి స్వదేశీ టీకాను సాకారం చేసేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

Read This: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

ఇందుకోసం ఈ వైరస్‌ రకాన్ని భారత్‌ బయోటెక్‌ సంస్థకు ఎన్‌ఐవీ విజయవంతంగా బదిలీ చేసినట్లు ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన చేసింది. టీకా అభివృద్ధికి సంబంధించిన పనులను రెండు భాగస్వామ్య సంస్థలు ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌ బయోటెక్‌కు ఎన్‌ఐవీ నిరంతర తోడ్పాటు అందిస్తుందని తెలిపింది. టీకాను త్వరగా అభివృద్ధి చేయడానికి, ఆ తర్వాత జంతు అధ్యయనాలు, క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించడానికి అవసరమైన అనుమతులను వేగంగా సాధించేందుకు ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌లు కృషి చేస్తాయని వివరించింది.

Read This: లాక్ డౌన్ తర్వాత.. పెళ్లిళ్లు చేసుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

కాగా, ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారికి మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడి వివిధ ఔషదాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచదేశాల కంటే ముందుగా భారత్‌లోనే కరోనాకు విరుగుడు తయారీలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Read This: నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu