ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

పందిళ్లు.. తోరణాలు.. చప్పట్లు.. మేళతాళాలు.. తలంబ్రాలు.. విందు భోజనాలు.. ఇవన్నింటి మేళవింపే పెళ్ళంటే.. పెళ్లిళ్లలో ఉండే జోష్, సందడి అసలు మాములుగా ఉండదు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇకపై వీటి గురించి పూర్తిగా మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్ముందు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఈ విషయంలో పెద్దోడు, పేదోడు అంటూ మినహాయింపు ఏమి లేదు. అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. కోవిడ్ 19 నేపధ్యంలో అమలవుతున్న అంటువ్యాధుల చట్టం 1897 […]

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!
Follow us

|

Updated on: May 10, 2020 | 1:57 PM

పందిళ్లు.. తోరణాలు.. చప్పట్లు.. మేళతాళాలు.. తలంబ్రాలు.. విందు భోజనాలు.. ఇవన్నింటి మేళవింపే పెళ్ళంటే.. పెళ్లిళ్లలో ఉండే జోష్, సందడి అసలు మాములుగా ఉండదు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇకపై వీటి గురించి పూర్తిగా మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్ముందు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఈ విషయంలో పెద్దోడు, పేదోడు అంటూ మినహాయింపు ఏమి లేదు. అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. కోవిడ్ 19 నేపధ్యంలో అమలవుతున్న అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం వివాహాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.

Read This:  గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు

జిల్లా కల్లెక్టర్ల సూచనల మేరకు ముందుగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వివాహ వేడుక ప్రాంతాన్ని పరిశీలించి పెళ్లికి 10 లేదా 20 మంది హాజరు అనేది నిర్ణయిస్తారు. పురోహితుడుతో పాటు వరుడు, వధువు తరపున ఎంతమంది హాజరావుతరన్న వివరాలను ముందుగా తెలపడంతో పాటు భౌతిక దూరం, మాస్కులు ధరించడం, పరిశుభ్రతను ఖచ్చితంగా పాటిస్తామంటూ ఓ ప్రమాణ పత్రంపై సంతకం చేసి ఇవ్వాలి. అంతేకాకుండా ఊరేగింపులు, బహిరంగ వేడుకలు, సాముహిక విందులు లాంటివి నిర్వహించబోమని కూడా అందులో తెలిపాలి. కాగా, కరోనాకు మందు దొరికే వరకు కొద్దినెలల పాటు ఈ జాగ్రత్తలు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.

Read This: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!