గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారిన తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పరీక్షలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి నెలలో విద్యార్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదో తరగతి పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. మొత్తం 5. 34 లక్షల మంది విద్యార్ధులకు గతంలో […]

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు...
Follow us

|

Updated on: May 10, 2020 | 1:59 PM

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారిన తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పరీక్షలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి నెలలో విద్యార్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదో తరగతి పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. మొత్తం 5. 34 లక్షల మంది విద్యార్ధులకు గతంలో 2530 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

ఎగ్జామ్స్ నిర్వహణపై హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే ఈ నెలాఖరులోగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మిగిలిన పరీక్షలు కోసం విద్యార్ధులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టాలన్నారు. అంతేకాక కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతీ బెంచ్‌కు ఒకరు మాత్రమే కూర్చునే విధంగా.. విద్యార్ధుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

ఇది చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!