కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

కరోనా రోగుల డిశ్చార్జ్ విషయమై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనాతో చికిత్స పొందుతున్నవారిని డిశ్చార్జ్ చేసే ముందు రెండుసార్లు టెస్టులు నిర్వహించి.. వాటిల్లో నెగటివ్ వచ్చిన తర్వాతే ఇంటికి పంపించేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న రోగులకు పది రోజుల తర్వాత వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చునని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. Read This: ప్రభుత్వం […]

Ravi Kiran

|

May 10, 2020 | 1:59 PM

కరోనా రోగుల డిశ్చార్జ్ విషయమై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనాతో చికిత్స పొందుతున్నవారిని డిశ్చార్జ్ చేసే ముందు రెండుసార్లు టెస్టులు నిర్వహించి.. వాటిల్లో నెగటివ్ వచ్చిన తర్వాతే ఇంటికి పంపించేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న రోగులకు పది రోజుల తర్వాత వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చునని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read This: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!

ఇందులో భాగంగానే కరోనా బాధితులను రోగ తీవ్రతను ఆధారం చేసుకుని మూడు రకాలుగా విభజించింది. స్వల్ప, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలు.. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేయొచ్చు.. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను మాత్రం లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేసి నెగటివ్ వచ్చిన తర్వాతే హోం క్వారంటైన్‌కు పంపాలని కేంద్రం సూచిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది.

Read This:  గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu