AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో కరోనాతో ఏఎస్‌ఐ మృతి…పోలీసు శాఖలో మూడో మరణం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. పోలీసు శాఖలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర పోలీసు శాఖలో మరో కరోనా మరణం నమోదైంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీస్‌శాఖలో కరోనాతో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. గతంలో ఓ కానిస్టేబులు, హోంగార్డు చనిపోగా..తాజాగా గాంధీ ఆసుపత్రిలో...

హైదరాబాద్‌లో కరోనాతో ఏఎస్‌ఐ మృతి...పోలీసు శాఖలో మూడో మరణం..
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2020 | 7:09 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. పోలీసు శాఖలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర పోలీసు శాఖలో మరో కరోనా మరణం నమోదైంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీస్‌శాఖలో కరోనాతో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. గతంలో ఓ కానిస్టేబులు, హోంగార్డు చనిపోగా..తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలాపత్తర్‌కు చెందిన ఏఎస్సై (ASI) మహ్మద్‌ యూసఫ్‌ చనిపోయారు.

హైదరాబాద్‌లో కాలాపత్తర్ పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న యూసుఫ్(47) ఈనెల 20న కరోనా లక్షణాలతో గాంధీలో చేరారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లైయింది. చత్రినాక పోలీస్‌స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఏఎస్సైగా పదోన్నతిపొంది కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్లో ఈ నెల మొదటి వారం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 15న కరోనా నిర్థారణ కావడంతో గాంధీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌‌లో కోవిడ్ బారిన మరణించిన వారి సంఖ్య మూడుకి చేరింది. కాగా, తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌లు సహా దాదాపు 200 మంది పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం.

ఇక, ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7820కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 730 కొత్త కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులను గుర్తించారు.

'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్