AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హలీం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..!

రంజాన్ మాసం వస్తుందంటే చాలు.. హైదరాబాద్‌లో ఏ గల్లీ వైపు తొంగి చూసినా.. హలీం ఘుమఘమల వాసన వస్తుంటుంది. రంజాన్ నెలంతా నగర వాసులు ఈ హలీంను లొట్టలేసుకుంటూ తింటారు. పలు రెస్టారెంట్లు హలీంను డోర్‌ డెలివరీ కూడా చేస్తుంటాయి. అయితే ఈ సారి రంజాన్‌ మాసంలో హలీం ప్రియులకు హలీం మేకర్ అసోసియేషన్ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఈ సారి హలీం తయారు చేయడం కానీ అమ్మడం కానీ […]

హలీం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 3:18 PM

Share

రంజాన్ మాసం వస్తుందంటే చాలు.. హైదరాబాద్‌లో ఏ గల్లీ వైపు తొంగి చూసినా.. హలీం ఘుమఘమల వాసన వస్తుంటుంది. రంజాన్ నెలంతా నగర వాసులు ఈ హలీంను లొట్టలేసుకుంటూ తింటారు. పలు రెస్టారెంట్లు హలీంను డోర్‌ డెలివరీ కూడా చేస్తుంటాయి. అయితే ఈ సారి రంజాన్‌ మాసంలో హలీం ప్రియులకు హలీం మేకర్ అసోసియేషన్ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఈ సారి హలీం తయారు చేయడం కానీ అమ్మడం కానీ ఉండదని ప్రకటించింది. అయితే పలు పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. దీంతో ఈ ఏడాది హలీం వంటకం లేనట్టేనని తెలుస్తోంది.

అయితే ఎక్కువ మంది ఈ హలీంను ఇష్టపడేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది తింటే అతి తక్కువ సమయంలోనే డైజెస్ట్ అవుతుందని.. అంతేకాకుండా.. పుష్టిగా మాంసకృతులతో పాటు.. ప్రోటీన్లు కూడా ఉంటాయని.. ఎక్కువ మంది దీనికే మొగ్గుచూపుతారు. రంజాన్ మాసంలో తెల్లవారుజాము నుంచి ఉపవాసం ఉండేవారు.. సాయంత్రం ఈ హలీం తింటే వెంటనే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో రంజాన్ మాసంలో ఈ హలీంకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.