ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. హాస్పిటల్‌లో మొత్తం 48 మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మేల్ వార్డులో 34 మంది పేషెంట్స్‌కు, ఫీమేల్ వార్డులో ముగ్గురి పేషెంట్స్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టుల్లో తేలింది. అలాగే ముగ్గురు డాక్టర్లకు కోవిడ్ పాజిటివ్ రాగా....

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. హాస్పిటల్‌లో మొత్తం 48 మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మేల్ వార్డులో 34 మంది పేషెంట్స్‌కు, ఫీమేల్ వార్డులో ముగ్గురి పేషెంట్స్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టుల్లో తేలింది. అలాగే ముగ్గురు డాక్టర్లకు కోవిడ్ పాజిటివ్ రాగా.. వీరిలో ఇద్దరు ఇప్పటికే రికవరీ అయ్యారు. అటే నలుగురు నర్సులకు కూడా కరోనా సోకగా ఇప్పటికే నలుగురు రికవరీ అయ్యారు. వీరందరనీ హాస్పిటల్‌లోనే ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సీరియస్‌గా ఉన్నవాళ్లని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
కాగా ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల్లో 1618 మంది కరోనా బారిన పడగా, 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 93,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల 711 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 21,024 ఉండగా, మొత్తం రికవరీ కేసులు 72,202గా ఉన్నాయి. తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవర్నమెంట్ తెలిపింది.
Read More:
హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్