కరోనాను ‘తరిమికొట్టిన’ 106 ఏళ్ళ బామ్మ !

మహారాష్ట్ర లోని థానే జిల్లాలో 106 ఏళ్ళ వృధ్ధురాలు కరోనాను జయించింది. ఈ జిల్లాలోని దోంబివిలీ  గ్రామంలో అసలు హాస్పటలే లేదు. ఎలా సోకిందో గానీ ఈ బామ్మకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈమెను ఈమె కోడలు దగ్గరలోనే ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకువెళ్తే..

కరోనాను 'తరిమికొట్టిన' 106 ఏళ్ళ బామ్మ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 20, 2020 | 4:11 PM

మహారాష్ట్ర లోని థానే జిల్లాలో 106 ఏళ్ళ వృధ్ధురాలు కరోనాను జయించింది. ఈ జిల్లాలోని దోంబివిలీ  గ్రామంలో అసలు హాస్పటలే లేదు. ఎలా సోకిందో గానీ ఈ బామ్మకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈమెను ఈమె కోడలు దగ్గరలోనే ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకువెళ్తే.. ఈమె వయస్సు దృష్ట్యా అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు. అయితే ఆ కోడలమ్మ కూడా చాలా మంచిదే మరి ! తన అత్తను కళ్యాణ్ దోంబివిలీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ‘వన్ రూపీ క్లినిక్’ లో అడ్మిట్ చేయించింది. ఆ చిన్నపాటి క్లినిక్ కూడా పెద్దామెను చేర్చుకున్నాయి. పది రోజుల క్రితం ఇక్కడ చేరిన ఈ శతాధిక వృధ్ధురాలు డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలతో ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది. ఈమెను ఆదివారం డిశ్చార్జ్ చేశారు. రోగి నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేసే ఈ చిన్న ఆసుపత్రిలో రైల్వే ప్రమాదాల్లో గాయపడినవారికే చికిత్స చేస్తారట. అయినా కరోనా బారిన పడిన ఈమెను అడ్మిట్ చేసుకుని ఆమె నుంచి కరోనాను దూరం చేసింది ఈ పెద్ద మనసున్న చిన్న  ఆసుపత్రి !

Latest Articles