కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.9.50 లక్షల జరిమానా..!

కరోనా వైరస్ మహమ్మరి ప్రకోపానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్ కట్డడిలో భాగంగా అయా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.9.50 లక్షల జరిమానా..!
Follow us

|

Updated on: Sep 20, 2020 | 5:22 PM

కరోనా వైరస్ మహమ్మరి ప్రకోపానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్ కట్డడిలో భాగంగా అయా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించనిపక్షంలో… 10 వేల పౌండ్లు (సుమారు రూ. 9.5 లక్షలు) జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, లేదంటే కరోనావైరస్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినట్లు గులెర్తించినా… వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయనివారికి…సెప్టెంబరు 28వ తేదీ నుంచి భారీ జరిమానాలను విధించనున్నట్లు వెల్లడించింది. కరోనా కేసులు ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతూండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారు పేర్కొన్నారు. కాగా… శనివారం ఒక్కరోజే ఇంగ్లండ్‌లో కొత్తగా 4,422 పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. స్కాట్లాండ్‌లో 350, వేల్స్‌లో 212, నార్తర్న్ ఐర్లాండ్‌లో 222 కేసులు నమోదయ్యాయి.

దీంతో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే… కరోనాతో పోరాటంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించడమే సరైన మార్గమని ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ‘నిబంధనలు పాటించడం చాలా అవసరం. కరోనా పాజిటివ్‌గా తేలితే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే జరిమానాలు చెల్లించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనావైరస్ నిబంధనలు పాటించకపోవడంతో ఇంగ్లండ్, వేల్స్‌‌లలో 19 వేల మందికి పైగా జరిమానాలు విధించారని అటార్నీ జనరల్ వెల్లడించారు. అయితే… ఆ జరిమానాలను ఇందులో సగం మంది కూడా ఇంకా చెల్లించలేదని సమాచారం.

అలాగే, సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలను పట్టించుకోకుండా విధులకు రమ్మని చెప్పే యజమానులు కూడా దీని పరిధిలోకి వస్తారు. సెప్టెంబరు 28 నుంచి తాజా నిబంధనలుఅమలు కానున్నాయి. కొత్త నిబంధనల అమలును స్థానిక అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తారు. కాగా… అల్పాదాయవర్గాలు, వర్క్ ఫ్రం హోం చేయడానికి వీలులేని వారు సెల్ఫ్ ఐసోలేషన్ కాలంలో 500 పౌండ్లను సుమారు రూ. 47,500 ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారన అధికారులు పేర్కొన్నారు.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే