నాయనమ్మ నుంచి వంటింటి చిట్కాలు నేర్చుకుంటున్న చెర్రీ

ఇక రామ్‌ చరణ్ ఇంట్లోనే ఉంటూ తన భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంట కూడా వండి పెట్టాడు. ముందు రాజమౌళి విసిన 'బీ ద రియల్ మేన్ ఛాలెంజ్‌'ను స్వీకరించి ఇంట్లో పనులు చేసిన సంగతి..

  • Tv9 Telugu
  • Publish Date - 1:33 pm, Fri, 1 May 20
నాయనమ్మ నుంచి వంటింటి చిట్కాలు నేర్చుకుంటున్న చెర్రీ

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు.. వివిధ రకాల ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీలు దొరికిన సమయాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండటంతో లాక్‌డౌన్ వారికి ఉపశమనంగా ఉంది. ఇక రామ్‌ చరణ్ ఇంట్లోనే ఉంటూ తన భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంట కూడా వండి పెట్టాడు. ముందు రాజమౌళి విసిన ‘బీ ద రియల్ మేన్ ఛాలెంజ్‌’ను స్వీకరించి ఇంట్లో పనులు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా చెర్రీ.. ఇంట్లో ఉన్న నాయనమ్మ అంజనీ దేవి, అమ్మ సురేఖ దగ్గర మజ్జిగ నుంచి వెన్న ఎలా తీయడమనేదాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. కాగా చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాకు పెద్ద బ్రేక్ పడింది.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!