AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాకు నేను నచ్చలేదు’ అందుకే ఇలా చేశా: నారా రోహిత్

బొద్దుగా క్యూట్‌గా ఉండే.. టాలీవుడ్‌ హీరో నారా రోహిత్‌‌.. తాజాగా ఫిట్‌గా మారి, మీసం కట్టుతో.. కొత్తలుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అయితే తాను ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం తనపై తొలిషాట్ తీసిన..

'నాకు నేను నచ్చలేదు' అందుకే ఇలా చేశా: నారా రోహిత్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 06, 2020 | 1:33 PM

Share

బొద్దుగా క్యూట్‌గా ఉండే.. టాలీవుడ్‌ హీరో నారా రోహిత్‌‌.. తాజాగా ఫిట్‌గా మారి, మీసం కట్టుతో.. కొత్తలుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అయితే తాను ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం తనపై తొలిషాట్ తీసిన రోజున అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించాడు.

పాత లుక్‌లో ఉన్న’తనకి తాను నచ్చటం లేదట’.. అందుకే ఫిట్‌గా కనిపించేందుకు ఏడాది నుంచి కసరత్తులు చేస్తూ ఇలా మారినట్లు తెలిపాడు రోహిత్. లాక్‌డౌన్‌తో జిమ్ మూతపడటం వల్ల ఇంట్లోనే డైట్ పాటిస్తూ వ్యాయామాలు చేస్తున్నట్లు చెప్పాడు. కాగా నారా రోహిత్ ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 11 ఏళ్లు అయ్యింది. ఇదే రోజు తనపై తొలిషాట్ తీశారని చెబుతూ.. అందుకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేశ్‌తో కలిసి ట్విట్టర్‌లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు రోహిత్.

‘బాణం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. సోలో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతం వైవిధ్య భరితమైన పాత్రలు చేస్తూ మెప్పించాడు. కాగా గత కొద్ది కాలం నుంచి నటనకు దూరంగా ఉన్నాడు రోహిత్. ప్రస్తుతం ‘అనగనగా దక్షిణాదిలో, శబ్దం, పండగలా వచ్చాడు, మదరాసి’ ప్రాజెక్టులు చేస్తున్నాడు. అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్

Follow Us