Corona Warriors: గ్రాండ్ వెల్‌కమ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్.. వీడియో వైరల్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పోరు చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు డాక్టర్లు. కుటుంబానికి దూరంగా.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు ఆసుపత్రుల్లోనే ఉంటూ ఎంతోమంది రోగులను వారు కాపాడుతున్నారు. డాక్టర్లు దేవుళ్లతో సమానం అన్న విషయాన్ని కరోనా క్లిష సమయంలో వారు నిరూపిస్తున్నారు. అందుకు కృతఙ్ఞత భావంగా పలుచోట్ల ఇంటికొచ్చిన డాక్టర్లు, నర్సులకు అద్భుత స్వాగతం లభిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళా డాక్టర్‌కు చుట్టుపక్కల వారి నుంచి ఘన స్వాగతం లభించింది. […]

Corona Warriors: గ్రాండ్ వెల్‌కమ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్.. వీడియో వైరల్‌
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 7:57 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పోరు చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు డాక్టర్లు. కుటుంబానికి దూరంగా.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు ఆసుపత్రుల్లోనే ఉంటూ ఎంతోమంది రోగులను వారు కాపాడుతున్నారు. డాక్టర్లు దేవుళ్లతో సమానం అన్న విషయాన్ని కరోనా క్లిష సమయంలో వారు నిరూపిస్తున్నారు. అందుకు కృతఙ్ఞత భావంగా పలుచోట్ల ఇంటికొచ్చిన డాక్టర్లు, నర్సులకు అద్భుత స్వాగతం లభిస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళా డాక్టర్‌కు చుట్టుపక్కల వారి నుంచి ఘన స్వాగతం లభించింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు విజయశ్రీ అనే వైద్యురాలు సేవలందిస్తోంది. 20 రోజుల పాటు అక్కడే ఉన్న ఆమె.. ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలిసిన కాలనీ, అపార్ట్‌మెంట్ వాసులు ఆమెకు అండగా నిలిచి చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగతానికి విజయా రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read This Story Also: అడ్డుకున్నందుకు పోలీసును 200మీటర్లు కారుతో లాక్కెళ్లి..!