AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు వివరించారు. ప్ర‌ణ‌బ్‌ వెంటిలేటర్‌పైననే..

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2020 | 2:17 PM

Share

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు వివరించారు. ప్ర‌ణ‌బ్‌ వెంటిలేటర్‌పైననే చికిత్స తీసుకుంటున్నారని, ఆయ‌న ఇంకా డీప్ కోమాలోనే ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తాయ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

Read More:

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే

Follow Us