తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో..
గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు వేల మార్క్‌ను దాటేసింది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. ఏకంగా 110 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక జిల్లాల వారీగా.. ఆదిలాబాద్ 7 కేసులు, రంగారెడ్డిలో 6, […]

గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు వేల మార్క్‌ను దాటేసింది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. ఏకంగా 110 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక జిల్లాల వారీగా.. ఆదిలాబాద్ 7 కేసులు, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. గురువారం నాడు నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,147కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 105కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1455 కాగా.. కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 1587 మంది కోలుకున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 04.06.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/4SAFie2Qff
— Eatala Rajender (@Eatala_Rajender) June 4, 2020