ఆ డబ్బు మేము చెల్లిస్తాం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యం విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యం విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్పంగా కరోనా లక్షణాలు అలాగే పూర్తిగా లక్షణాలు లేని వారికి వైద్యం చేసే ప్రైవేట్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి బీమా పథకం కింద డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రేట్లను కూడా ఫిక్స్ చేసింది. జనరల్ వార్డులో రూ.5వేలు, ఐసీయూలో రూ.10వేలు నుంచి రూ.13వేల వరకు చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్స కోసం వెళితే ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తమిళనాడు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో.. కొవిడ్-19 చికిత్సకు ఒక నిర్ధిష్ట ఛార్జీలను తమిళనాడు ప్రభుత్వం నిర్ధారించింది.
కాగా తమిళనాడులో ఇవాళ భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 1384 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 27,256కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 12 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 220కు చేరింది. ఇప్పటివరకు 14,901 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇవాళ ఒక్కరోజే 585 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 12,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read This Story Also: చంద్రబాబుకు ఊహించని షాక్.. కీలక నేత సడన్ రాజీనామా..!