బ్రేకింగ్‌ న్యూస్.. కాంగ్రెస్‌ నేతకు కరోనా పాజిటివ్..! రీజన్‌ ఇదే..

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. కులం, మతం, భాష, రంగు, దేశం అన్న తరతమ భేదాలేమీ లేవు. ఈ మహమ్మారికి అంతా ఒక్కటే అన్నట్లైంది. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 6వేల మంది వరకు ఆస్పత్రిపాలవ్వగా.. మరో 199 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఈ వైరస్‌ కాంగ్రెస్‌ నేతను కూడా కాటేసింది. అంతేకాదు.. అతని కుటుంబంలోని భార్య, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:54 pm, Fri, 10 April 20
బ్రేకింగ్‌ న్యూస్.. కాంగ్రెస్‌ నేతకు కరోనా పాజిటివ్..! రీజన్‌ ఇదే..

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. కులం, మతం, భాష, రంగు, దేశం అన్న తరతమ భేదాలేమీ లేవు. ఈ మహమ్మారికి అంతా ఒక్కటే అన్నట్లైంది. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 6వేల మంది వరకు ఆస్పత్రిపాలవ్వగా.. మరో 199 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఈ వైరస్‌ కాంగ్రెస్‌ నేతను కూడా కాటేసింది. అంతేకాదు.. అతని కుటుంబంలోని భార్య, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమావేశాలకు ఈ కాంగ్రెస్‌ నేత కూడా హాజరైవ్వడంతోనే.. కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన దాచిపెట్టడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అతను ఉన్న నివాస ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా పేర్కొన్నారు.