కరోనా వ్యాప్తి: కరెన్సీ వద్దు.. డిజిటల్ చెల్లింపులే చేయండి..
కరోనా వైరస్.. కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతుందనే వార్తలు ప్రజలను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే డిజిటల్ చెల్లింపులే..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పరిగెట్టిస్తోంది. ఒక్కసారిగా ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తోంది. మందు కూడా లేకపోవడంతో దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలీక ప్రపంచ దేశాల అధ్యక్షులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య వేలల్లో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్.. కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతుందనే వార్తలు ప్రజలను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే డిజిటల్ చెల్లింపులే మేలని బ్యాంకుల ఖాతాదారులకు సూచించింది ఆర్బీఐ.
అన్ని రకాల చెల్లింపుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, బీబీఎస్ వంటి డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. దీంతో చెల్లింపులతో బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీలు ముగించుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అలాగే సామాజిక దూరంతో పాటు కరోనా వ్యాప్తిని కూడా కాస్త అదుపు చేసే వీలు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ద్వారా ప్రచారం ప్రారంభించింది. కాగా భారత్‌లో 6,412 మందికి కరోనా సోకగా.. 199 మంది మరణించారు. అలాగే 504 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇవి కూడా చదవండి:
కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి
కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్
జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్
బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..
తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ