ఆప్త మిత్రునికి థ్యాంక్స్..మోదీకి ఇజ్రాయెల్ ప్ర‌ధాని ఎమోష‌న‌ల్ ట్వీట్..

భారత్.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి..స‌ద‌రు మెడిసిన్ ను ఇతర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాల నుంచి ఇండియాకు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. గురువారం అమెరికా, బ్రెజిల్‌ తో పాటు కొన్ని దేశాలు ప్రధాని మోదికి థాంక్స్ చెప్ప‌గా..శుక్రవారం నాడు ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో చేరింది. గురువారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇజ్రాయెల్‌ కు పంపడంతో, ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. మోదికి ధ‌న్యావాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు భారత ప్రధాని, నా […]

ఆప్త మిత్రునికి థ్యాంక్స్..మోదీకి ఇజ్రాయెల్ ప్ర‌ధాని ఎమోష‌న‌ల్ ట్వీట్..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 7:30 PM

భారత్.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి..స‌ద‌రు మెడిసిన్ ను ఇతర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాల నుంచి ఇండియాకు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. గురువారం అమెరికా, బ్రెజిల్‌ తో పాటు కొన్ని దేశాలు ప్రధాని మోదికి థాంక్స్ చెప్ప‌గా..శుక్రవారం నాడు ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో చేరింది. గురువారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇజ్రాయెల్‌ కు పంపడంతో, ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. మోదికి ధ‌న్యావాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు భారత ప్రధాని, నా ఆప్త మిత్రుడు మోదీ కి థ్యాంక్స్. ఇజ్రాయెల్ ప్ర‌జ‌లంతా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కరోనా వైర‌స్ విజృంభణ ప్రారంభమైన‌ప్ప‌టికీ నేను మోదీతో ఎప్ప‌టిక‌ప్పుడు చర్చ‌లు జ‌రుపుతున్నారు. పరిస్థితులపై ఎప్పటికపుడు సమీక్ష‌లు జరుపుతున్నాం అని నెతన్యాహు ట్వీట్‌ చేశారు.

నెతన్యాహు ట్వీట్ కు ప్రధాని మోదీ కూడా స్పందించారు. కరోనా వైర‌స్ పై మనం కలిసి పోరాడాలని మోదీ పిలుపునిచ్చారు. తన స్నేహితుల‌కు సాయం చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు హెల్తీగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.

భారత్‌కు ఇజ్రాయెల్ ఎంతో నమ్మకమైన మిత్ర దేశమని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బెంజమిన్ నెతన్యాహూ మోదీ పట్ల త‌న గౌర‌వాన్ని ఎప్పుడూ చాటుతూనే ఉంటారు. మనం రక్షణ సాంకేతిక వ్యవహరాల్లో ఇజ్రాయెల్ అనేక విధాలుగా స‌హాయం అందిస్తోంది.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.