కరోనాపై యుద్ధం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం మిచ్చిన టీఎస్ ఫిల్మ్ ఛాంబర్

కరోనాపై యుద్ధం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం మిచ్చిన టీఎస్ ఫిల్మ్ ఛాంబర్

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి ముందుకు వచ్చింది.. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి.. రూ.25 ల‌క్ష‌లు విరాళంగా...

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 4:05 PM

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి ముందుకు వచ్చింది.. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి.. రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అందించింది. ఈ మేర‌కు ఛాంబర్ ప్ర‌తినిధులు శుక్ర‌వారం తెలంగాణ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్‌ను క‌లిసి రూ. 25 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మ‌న్ పి.రామ్మోహ‌న్ రావు, ఛాంబర్ అధ్య‌క్షుడు కె.ముర‌ళీమోహ‌న్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ నారంగ్‌, అభిషేక్ నామా పాల్గొన్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న అవిర‌ళ కృషిని వారు ప్ర‌శంసించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికీ, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌నీ, ఎవ‌రిళ్ల‌ల్లో వారు సుర‌క్షితంగా ఉంటూ క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా త‌మ వంతు పాత్ర పోషించాల‌ని వారు కోరారు.

ఇవి కూడా చదవండి:

కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu