Love You Zindagi: నా జీవితంలో ఇలాంటి పేషెంట్‌ను ఎప్పుడూ చూడ‌లేదు.. ‘ల‌వ్ యూ జింద‌గీ’ యువతిపై డాక్ట‌ర్ ప్ర‌శంస‌..

Love You Zindagi: క‌రోనా మ‌హ‌మ్మారి క‌నీస క‌నిక‌రం అంటూ లేకుండా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. కొండంత ధైర్య‌మున్న వ్య‌క్తిని సైతం క్ష‌ణాల్లో కుప్ప‌కూలిపోయేలా చేస్తోంది. కంటికి క‌నిపించని...

Love You Zindagi: నా జీవితంలో ఇలాంటి పేషెంట్‌ను ఎప్పుడూ చూడ‌లేదు.. 'ల‌వ్ యూ జింద‌గీ' యువతిపై డాక్ట‌ర్ ప్ర‌శంస‌..
Love You Gindaji Girl
Follow us
Narender Vaitla

|

Updated on: May 15, 2021 | 5:05 PM

Love You Zindagi: క‌రోనా మ‌హ‌మ్మారి క‌నీస క‌నిక‌రం అంటూ లేకుండా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. కొండంత ధైర్య‌మున్న వ్య‌క్తిని సైతం క్ష‌ణాల్లో కుప్ప‌కూలిపోయేలా చేస్తోంది. కంటికి క‌నిపించని మాయ‌దారి వైర‌స్ మ‌నిషిని శారీర‌కంగా, మాన‌సికంగా దెబ్బ‌తిస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీలో ఓ యువ‌తి ఎమ‌ర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోన్న స‌మ‌యంలో ల‌వ్ యూ జింద‌గీ పాట‌కు హ‌మ్ చేస్తూ.. దేశాన్ని ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆమె ధైర్యం ముందు క‌రోనా ఓడిపోతుంద‌ని అంతా ఆశించారు.. కానీ క‌రోనా ఆ యువ‌తిని బ‌లి తీసుకుంది. త‌న ధైర్యంతో దేశాన్ని ఆక‌ర్శించిన యువ‌తి మ‌ర‌ణాన్ని దేశం త‌ట్టకోలేక‌పోయింది. ఆమె మ‌ర‌ణానికి చింతిస్తూ అంద‌రూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే న‌టుడు సోన్‌సూద్ కూడా ఇది చ‌లా విషాద‌ర‌క‌మైన సంఘ‌ట‌న అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ బ్రేవ్ గ‌ర్ల్ గురించి ప్ర‌పంచానికి తెలియ‌డానికి కార‌ణం ఆమెను ద‌గ్గ‌రుండి చూసుకున్న డాక్ట‌ర్ మౌనిక‌. ఆమె ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేయ‌డం వ‌ల్లే ఆ యువ‌తి గురించి అంద‌రికీ తెలిసింది. ఇదిలా ఉంటే యువ‌తి మ‌ర‌ణం తర్వాత డాక్ట‌ర్ మౌనిక‌.. మ‌రోసారి స్పందించారు. ఆ యువ‌తి ధైర్యం గురించి మాట్లాడుతూ.. నేను నా జీవితంలో ఇలాంటి రోగిని చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ మాట్లాడుతూ..“ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు కూడా చాలా సానుకూలంగా స్పందించే వ్య‌క్తులు. త‌ను ఐసీయూలో ఉన్న‌ప్పుడు ఆడియో మెసేజ్‌ల‌ను పంపించే వారు. వారు చెప్పిన మాట‌లు ఆమెలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. డాక్ట‌ర్‌గా నేను చాలా మంది రోగుల‌ను చూశాను. కానీ ఈ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌తో నాకు ఒక ప్ర‌త్యేక బంధం ఏర్ప‌డిందని చెప్పుకొచ్చారు.

Also Read: Plasma Therapy: కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేదా? ఐసీఎంఆర్ ఏం చెప్పింది? ప్లాస్మా థెరపీ..నమ్మలేని నిజాలు!

ఈ ప్రదేశం ఒక్కటే యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తుంది.. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే.. ఎక్కడుందంటే..

Coronavirus Genetic: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హుస్సేన్ సాగర్‌తో సహా పలు చెరువుల్లో కరోనా జన్యు అనవాళ్లు..!