డీఎంకేను కుదిపేస్తున్న కరోనా.. మరో ఎమ్మెల్యేకు పాజిటివ్
తమిళనాడులో డీఎంకే పార్టీని కరోనా మహమ్మారి కుదిపేస్తుంది. ఈ వైరస్ బారిన పడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ ఈ నెల 10న మరణించారు.

తమిళనాడులో డీఎంకే పార్టీని కరోనా మహమ్మారి కుదిపేస్తుంది. ఈ వైరస్ బారిన పడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ ఈ నెల 10న మరణించారు. మరోవైపు కరోనా సోకిన ఆ పార్టీ నేత బలరామన్ ఇవాళ మృతి చెందారు. తాజాగా డీఎంకే రిషివంత్యమ్ ఎమ్మెల్యే వసంతం కార్తికేయన్‌కి కరోనా నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతో సహా ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో డీఎంకే పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. కాగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలను దాటేసింది. అందులో 31వేలకు పైగా కోలుకోగా.. 700 మందికి పైగా మరణించారు.
Read This Story Also: కరోనాపై పోరు: మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం



