AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. దేశంలోనూ కరోనా కేసులు 32 లక్షలకు పైగానే నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా 10 వేలకి చేరువలో ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధుల్లోనూ కరోనా టెన్షన్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు […]

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 3:13 PM

Share

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. దేశంలోనూ కరోనా కేసులు 32 లక్షలకు పైగానే నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా 10 వేలకి చేరువలో ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధుల్లోనూ కరోనా టెన్షన్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిన పడగా.. వారిలో కొంతమంది కోలుకోగా, మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోని ప్రజాప్రతినిధుల్లో కరోనా ఆందోళన కొనసాగుతోంది. తమ దగ్గర పనిచేసే సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పటికే పలువురు అధికారులు హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

కాగా తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్ సురేష్ కరోనా వైరస్‌తో మృతి చెందాడు. కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే ఎవరైనా ఏమన్నా చులకనగా చూస్తారనుకుంటారని మొహమాటంతో మా గన్‌మెన్ సురేష్ మృతి చెందాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కేతి రెడ్డి మాట్లాడుతూ.. కరోనా రోగిని రోగిగా చూడకండి. అనుమానం వస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. ఈ విషయంలో అసలు మొహమాట పడకండంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా ధర్మవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

Read More: 

భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు

తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా