కరోనా అప్‌డేట్స్: ఏపీలో 294 కొత్త కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 294 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6152కు చేరింది.

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 294 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6152కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 253 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రాల్లో రెండు మరణాలు సంభవించాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 84కి చేరింది. అలాగే 2,752 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 15,633 పరీక్షలు నిర్వహించగా.. అందులో 253 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,841కు చేరింది. వారిలో తాజాగా 82 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 2,723కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 2,034 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా ఇద్దరికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 204కు చేరింది. అందులో తాజాగా ఒకరు డిశ్చార్జి కాగా.. 181 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 39 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1107కు చేరింది. వీరిలో 48 మంది తాజాగా డిశ్చార్జి అవ్వగా.. 537 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
Read This Story Also: కరోనా టైమ్.. శ్రుతీ తీరుకు మెచ్చుకోవాల్సిందే..!
#CovidUpdates: on 14/06/2020Last 24 hoursSamples tested: 15,633Positives: 253Discharged: 82Deceased: 2#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/S2QbYYC5LB
— ArogyaAndhra (@ArogyaAndhra) June 14, 2020



