ఢిల్లీలో అతిపెద్ద కరోనా ఐసొలేషన్ క్యాంపస్ !

దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ చుట్టుముట్టింది. అంతకంతకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో అల్లాడిపోతోంది. నానాటికీ పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు వైద్య చికిత్సను అందించడంపై దృష్టి పెట్టింది.

ఢిల్లీలో అతిపెద్ద కరోనా ఐసొలేషన్ క్యాంపస్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 4:01 PM

దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ చుట్టుముట్టింది. అంతకంతకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో అల్లాడిపోతోంది. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్రను మించిపోయింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లాక్‌డౌన్ అమలు చేసినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. ఢిల్లీలో రోజురోజుకూ గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. న్యూఢిల్లీలో 38,958 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1271 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నానాటికీ పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు వైద్య చికిత్సను అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఛత్తార్‌పూర్ ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్ బియాస్ క్యాంపస్‌లో అతిపెద్ద ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేయబోతోంది. ఒకేసారి 10 వేల మంది కరోనా బాధితులకు చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల్లో ఈ క్యాంపస్‌ను కరోనా పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ పనులను పరిశీలించారు. దేశ రాజధానిలో అనూహ్యంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ముందే అప్రమత్తమైన ప్రభుత్వం పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వైద్యాన్ని అందించడానికి అవరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి