AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నిద్ర పోతుందట.. పాక్‌ మతాధికారి వింత వ్యాఖ్యలు.. అంతేకాదు.. ఇంకా ఏం చెప్పాడంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు.

కరోనా నిద్ర పోతుందట.. పాక్‌ మతాధికారి వింత వ్యాఖ్యలు.. అంతేకాదు.. ఇంకా ఏం చెప్పాడంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 4:05 PM

Share

కరోనా మహమ్మారి రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలుత చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఆ తర్వాత బ్రిటన్‌, యూరప్ దేశాల్లో విజృంభించింది. ఆ తర్వాత.. అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తోంది. ఇక మొన్నమొన్నటి వరకు మన భారత్‌తో పాటు పొరుగు దేశాల్లో అత్యల్పంగా నమోదైన కేసులు.. ఇప్పుడు లక్షల్లోకి వెళ్లాయి. తాజాగా మన పొరుగుదేశం పాక్‌లో లక్ష మార్క్‌ను దాటేసింది. అయితే అక్కడ గత నెలలోనే లాక్‌డౌన్ కూడా ఎత్తేయడంతో.. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అక్కడ కొందరు మంత్రులు, మత పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే విన్నవారు నవ్వాపుకోలేకపోతున్నారు.

తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు. అందుకు ఓ విశ్లేషణ కూడా చెప్పడం.. అది విన్న వారంతా ఏం అనాలో అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. మనం నిద్రపోయే సమయంలో కరోనా కూడా నిద్రపోతుందని.. మనం మరణిస్తే అది కూడా మరణిస్తుందంటూ వింత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో పాకిస్థాన్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఎక్కువ సేపు నిద్ర పోవాలని వైద్యులు చెప్పారని ట్విస్ట్ కూడా ఇచ్చాడు. మనం ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే.. వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా నిద్రపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పాక్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిని అక్కడి ఓ జర్నలిస్ట్ సోసల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..