వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా?

Samatha

15  August 2026

సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు.

అంతే కాకుండా సీతాఫలంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

అయితే సీతాఫలాలు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. కానీ ఈ మధ్య వర్షాకాలంలో కూడా మార్కెట్‌లో ఈ పండ్లు లభిస్తున్నాయి.

దీంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సీజన్‌లో సీతాఫలాలు తినడం మంచిదా? కాదా చూద్దాం.

సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతంది.

అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తప్పకుండా దీని తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట.

శుభ్రంగా కడిగి తాజాగా ఉన్న కాయను మాత్రమే తినాలంట. ఎందుకంటే వీటి సీజన్ కాకపోవడం వలన రసాయనాలతో పండించిన పండ్లు మార్కెట్‌లోకి వస్తుంటాయి.

అంతే కాకుండా నల్ల మచ్చలు వంటివి ఉన్న పండు తినడం వలన ఫుడ్ పాయిజన్, ఫీవర్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట.